English   

విజయ్ కి తండ్రిగా మలయాళ హీరో

Suresh Gopi
2020-11-11 18:22:37

విజయ్ దేవరకొండ తెలుగు యూత్ లో విపరితమైన క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. లైఫ్ ఈస్ బ్యూటీఫుల్, ఏవడే సుబ్రమణ్యం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆతరువాత  అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాల విజయాలతో తెలుగులో స్టార్ హీరోల స్థాయికి ఏదిగాడు. కానీ విజయ్ కోరిక మాత్రం అన్ని భాషల ప్రేక్షకులని అలరించాలని ఉన్నటుంది. ఈ నేపఘ్యంలోనే  డియర్ కామ్రేడ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా విజయ్ ఆశలను తీర్చలేదు.  ఇప్పుడు మాత్రం విజయ్ పూరి జగన్నాథ్ తో కలిసి' ఫైటర్' అనే పానిండియా సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో సురేష్ గోపీ అనే మలయాళ నటుడు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సురేష్ గోపి తెలుగు వాళ్లకు ఎక్కువగా పరిచయం లేని నటుడు. కానీ తమిళంలో మాత్రం కొన్ని సినిమాల్లో నటించాడు. సురేష్ గోపి విజయ్ దేవరకొండకు తండ్రి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సురేష్ గోపి పాత్ర నిడివి సినిమాలో కేవలం పదిహేను నిమిషాలు మాత్రమేనని తెలుస్తుంది. వీరిద్దరి కాంబినాషన్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వల్ల ఇంతకాలం షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పూరి జగన్నాథ్ సినిమాలను త్యరగా పూర్తి చేయడంలో సిద్ధహస్తుడు గా మంచిపేరు ఉంది. ఈ సినిమాను కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.  విజయ్ కూడా ఈ సినిమా పూర్తవగానే సుకుమార్ తో మరో పానిండియా సినిమా ప్లాన్ చేసిన విషయం కూడా  తెలిసిందే. ఇలా వరస సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు గురిపెట్టిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలతో ఎలాంటి విజయం సాదిస్తాడో చూడాలి.

More Related Stories