English   

ఓటీటీలకు కేంద్రం షాక్..ఆ సీన్లపై నియంత్రణ

 Digital media
2020-11-11 18:29:00

ఓటీటీ లకు భారీ క్రేజ్ రావడంతో సదరు సంస్థలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వెబ్ సిరీస్ లలో అశ్లీలతను పెంచుతున్నాయి. కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో అయితే అశ్లీలతే కంటెంట్ గా వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి కంటెంట్ కు చెకంపెట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. యుట్యూబ్, ఓటీటీ, ఆన్లైన్ ఫిలిమ్స్, డిజిటల్ న్యూస్ ను కేంద్ర సమాచార శాఖ పరిధిలోకి తీసుకురావలంటూ ఓ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఈ నిర్ణయం తో అమెజాన్, నెట్ఫ్లిస్, ఆహా, హాట్ స్టార్ లాంటి ఓటీటీ లు కేంద్రం నియంత్రణలో ఉండనున్నాయి. గతంలో సైతం కేంద్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు కొన్ని సూచనలు చేసింది. ఓటీటీ లు స్వీయ నియంత్రణలోకి రావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 జనవరిలో కొన్ని ఓటీటీ సంస్థలు కోవిడ్ మార్గదర్శకాలపై సూచన ప్రాయంగా సంతకం చేసాయి. అయితే ఆ ఓటీటీ లు అవలంబించిన కోడ్ పై అభ్యంతరాలు ఉండటంతో కేంద్రం దానిని నిరాకరించింది. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓటీటీ లకు తిప్పలు రానున్నాయి. ప్రేక్షకులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కళ్లెం పడనునట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో బూతు కంటెంట్ ను ఇష్టపడే ప్రదక్షకులు సైతం నిరుత్సాహ పడనున్నారు. సినిమాలకు ఎలాగూ సెన్సార్ ఉంది..మళ్ళీ ఓటీటీ లకు కీడా ఈ గోలేంటి అంటూ క్రియేటివ్ పీపుల్ అనుకుంటున్నారు.
 

More Related Stories