English   

ఆకాశమే నీ హద్దురా రివ్యూ

Aakasham Nee Haddhu Ra
2020-11-12 12:23:45

ఒక్క రూపాయికే పేదవాడిని విమానంలో తిప్పాలనుకున్న గొప్ప వ్యక్తి కెప్టెన్ గోపీనాథ్ కథ ఆధారంగా "ఆకాశమే నీ హద్దురా" సినిమాను దర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించాడు. మోహన్ బాబు, అపర్ణబాల మురళి, పారేశ్ రావెల్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను కరోనా అమేజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం విడుదల చేసారు. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే...ఒక చిన్న గ్రామానికి చెందిన మహా అలియాస్ చంద్ర మహేష్ అనే ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి తండ్రి లానే సమాజం గురించి ఆలోచిస్తుంటాడు. ఎయిర్ఫోర్స్ లో పని చేస్తున్న మహా సామాన్యుడికి సైతం విమానం ఎక్కించాలనే గొప్ప ఆశయాన్ని కలిగి ఉంటాడు. దానికోసం ఎయిర్లైన్స్ ను ఏర్పాటు చేయాలనే కోరికను కలిగి ఉంటాడు. అయితే తన కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎలా అధిగమిస్తాడన్నదే ఈ సినిమా కథ. 

ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది

చుండూరు గ్రామంలో పేద కుటుంబం ఎదురుకొంటున్న కష్టాలను చూపిస్తూ కథ మొదలవుతుంది. రైలును ఆపేందుకు చేసిన ధర్నా సన్నివేశం ప్రేక్షకులను కథలోకి లాగుతాయి. సూర్య తండ్రి ఓ స్కూల్ టీచర్. అతడు గాంధేయ మార్గంలో జీవనం కొనసాగిస్తుంటాడు. సమస్యను పరిష్కారించాలంటే గాంధేయ మార్గమే సరైనదని నమ్ముతాడు. కానీ సూర్య మాత్రం దానికి భిన్నంగా ఉడుకు రక్తం కలిగిన యువకుడిలా ఆవేశంతో ఏదైనా సాధించాలనే పట్టుదల తో కనిపిస్తాడు. ఈ క్రమంలో సూర్య తన దారిని తాను వెత్తుకుంటూ వెళతాడు. కాగా సూర్య తండ్రి చావు బ్రతుకులతో కొట్టు మిట్టాడుతున్న సమయంలో సూర్య విమానం ఎక్కడానికి చేసిన ప్రయత్నాలు ప్రేక్షకుడి హృదయాన్ని పిండేశాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో పారిశ్రామిక వేత్తలు ఎత్తుగడలకు చిత్తయిన సూర్య మనకు కనిపిస్తాడు. మొత్తానికి ఫస్ట్ హాప్ స్పీడ్ గా ఎక్కడా బోర్ కొట్టకుండా కనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ కాస్త సగదీసినట్టుగా అనిపించినా సూర్య యాక్టింగ్ తో ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ లో మహా కి తన జీవిత భాగస్వామికి మధ్య ఉన్న అన్యోన్య బంధం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక సూర్య తనకు ఎదురైన ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ ఎలా ముందుకు వెళ్లే తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమా ఆధ్యంతం ఆసక్తిగా ఉండటంతో కొన్ని లోపాలు ఉన్నా కనుమారుగైపోయాయి.

సినిమాలో ప్లస్ లు మైనస్ లు

సూర్యా నటన, కథ, అపర్ణా బాల మురళి నటన, ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్, స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ గా నిలిచాయి. సెంకడ్ హాఫ్ లో స్లో నారేషన్ సినిమాకు మైనస్ గా నిలిచిందని చెప్పవచ్చు.

More Related Stories