English   

అల్లు అర్జున్ కు మరోసారి విలన్ గా తమిళ హీరో

Allu Arjun pushpa
2020-11-12 14:37:42

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ "పుష్ప" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్మగ్లింగ్ కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగా మధ్యలో కరోనా ఎఫెక్ట్ తో బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ పుష్ప షూటింగ్ ను తూర్పుగోదావరి జిల్లా మారేడ్ పల్లి అడవుల్లో మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ కి మొదట తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసారు. డేట్స్ కాళీ లేనందున సేతుపతి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దాంతో హిందీ, తమిళ ఇండస్ట్రీ లకు చెందిన పలువురు నటుల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

ఆర్య ఇప్పటికే "వరుడు" సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా నటించి అలరించాడు. అయితే వరుడు సినిమా మాత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. లారీ డ్రైవర్ స్థాయి నుండి స్మగ్లర్ గా ఎదిగిన పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నట విశ్వ రూపాన్ని చూపించేందుకు సిద్ధమౌతున్నారు. ఇక అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న "పుష్ప" ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More Related Stories