English   

బాలీవుడ్ లో మరో విషాదం.. డిప్రెషన్ తో ప్రముఖ నటుడు ఆత్మహత్య..

 Actor Asif Basra
2020-11-12 17:13:10

బాలీవుడ్లో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2020 చాలామందిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళిపోయింది. తాజాగా మరో ప్రముఖ నటుడు కూడా మరణించాడు. కేవలం 53 ఏళ్ల వయసులోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆసిఫ్ బాస్రా ఆత్మహత్య చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఆయన సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉరి వేసుకొని చనిపోయాడు. ఆసిఫ్ విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొని ఫోరెన్సిక్ టీంతో విచారణ మొదలు పెట్టారు. ఎందుకు ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. 

గత కొన్ని రోజులుగా ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడి బాధ పడుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారని వారు ఊహించలేదు. బాలీవుడ్ లో క్రిష్ 3, జబ్ వి మెట్, ఏక్ విలన్ ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు ఆసిఫ్. అలాగే సూర్య హీరోగా వచ్చిన అంజాన్ సినిమాలో కూడా నటించాడు. సినిమాలు, వెబ్ సిరీస్ చేసుకుంటూ బిజీగా ఉన్న సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన మరణానికి కేవలం డిప్రెషన్ మాత్రమే కారణమా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అలాగే ఆయన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులను కూడా విచారిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. 

More Related Stories