టాలీవుడ్ లో మరో విషాదం..కరోనాతో యువ రచయిత మృతి

కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పుంజుకుంటుంది. మొన్నటివరకు తక్కువ సంఖ్యలో నమోదైన కరోనా కేసులు చలికాలం రావడంతో మళ్ళీ పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో కరోనా కారణంగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయిన ఘటన ను మరవకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తాజాగా యువ రచయిత కరోనా తో చనిపోయారు. టాలీవుడ్ స్టోరీ రైటర్ వంశీ రాజేష్ కరోనాను బలయ్యారు. గత కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రెండు మూడు వారాలపాటు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు.కానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. రాజేష్ హీరో రవితేజ నటించిన "అమర్ అక్బర్ ఆంటోని" సినిమాకు రైటర్ గా పనిచేశాడు. అంతేకాకుండా త్వరలోనే ఆయన డైరెక్టర్ గా సినిమా తీయడానికి కూడా సిడిఫమౌతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనను కరోనా మింగివేయడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. టాలీవుడ్ లోని ప్రముఖ నటులు వంశీ మృతిపై సంతాపం ప్రకటించారు. ఇక వయసులో రాజేష్ కన్ను మూశారని ఆయన ఎంతో భవిష్యత్ ఉన్న రచయిత అని టాలీవుడ్ రచయితలు అభిప్రాయపడుతున్నారు.