గవర్నర్ కోటాలో గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ

తెలంగాణ శాసన మండలికి మూడు కొత్త ముఖాలు రాబోతున్నాయి. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన మూడుస్థానాలకు ప్రముఖ రచయిత గోరటి వెంకన్న, మాజీమంత్రి బస్వరాజు సారయ్య , బొగ్గారపు దయానంద్ పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురి పేర్లతో తయారు చేసిన జాబితాను గవర్నర్ ఆమోదానికి పంపినట్టు సమాచారం. ఇదిలా ఉండగా గోరటి వెంకన్న తెలంగాణ ఉద్యమ సమయంలో రచయితగా ప్రముఖ పాత్ర పోషించారు. సినిమాల విషయానికొస్తే వెంకన్న ఎన్నో సినిమాలకు పాటలు రాయడంతో పాడారు. "ధూమ్ ధామ్, బందూక్, దండకారణ్యం" సినిమాల్లో ఈయన రాసిన పాటలకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఇటీవల వచ్చిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమాలో కూడా ఆయన నటించారు. మరోవైపు చేనేత కష్టాలపై తీసిన సినిమాలో "ఓ జాంబియా " అనే పాటను ఆయనే పాడారు. ఈ పాట సినిమాలో సూపర్ హిట్ సాంగ్ గా నిలిచింది.