English   

ఈ ముగ్గురు విలన్ల రెమ్యునేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

jagapathi babu
2020-11-14 12:16:58

సినిమాలు సూపర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో హీరోకు సరితూగే విలన్లు కూడా ఉండాలి. అలా ఉంటేనే హీరోయిజం కూడా ఓ రేంజ్ లో కనిపిస్తోంది. దాంతో కొన్నేళ్లుగా హీరోలతో పాటుగా విలన్లకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. దాంతో ఒకప్పటి హీరోలు...ఇప్పటి హీరోలు కూడా మంచి అవకాశాలు వస్తే విలన్లుగా కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంటున్న విలన్లు సోనూసూద్, ప్రకాష్ రాజ్ , జగపతి బాబు అని చెప్పవచ్చు. ఇక ఈ విలన్ల రెమ్యూనేషన్లు కూడా గట్టిగానే ఉన్నాయి.

ప్రకాష్ రాజ్ : ప్రకాష్ రాజ్ ఓ విలక్షణ నటుడిగా దాదాపు ఐదు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు. సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సైతం అందుకున్నాడు. ఇక ప్రకాష్ రాజ్ సినిమాల్లో నెగెటివ్.. రోల్ అయినా పాజిటివ్ రోల్ అయినా సినిమాకు 2కోట్లు అందుకున్నటున్నట్టు తెలుస్తోంది. 

సోనూసూద్ :లాక్ డౌన్ కాలం నుండి రియల్ హీరోగా మారిపోయిన సోనూసూద్ కూడా టాలీవుడ్ లో మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో సోనూ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ మంచి విలన్ రోజుకు 20 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు టాక్. అంటే 20రోజులకు 4కోట్ల రెమ్యునేషన్ సోనూ తీసుకుంటున్నాడు.

జగపతిబాబు : జగపతి బాబు టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు విలన్ గా అంతకు రెండింతల గుర్తింపును సంపాదించాదానడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం జగపతిబాబు ఒక్కో సినిమాకు రూ.3 నుండి 4కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడట.

More Related Stories