English   

ఓదెల రైల్వేస్టేషన్ లో రాధగా వస్తున్న కుమారి

Hebah patel
2020-11-14 15:17:58

టాలీవుడ్ లోకి "అలా ఎలా" సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హాట్ హీరోయిన్ హెబ్భా పాటిల్. మొదటి సినిమాతోనే హెబ్భా ప్రేక్షకుల మదిని దోచేసింది. ఇక ఈ సినిమా తరవాత హెబ్బా "కుమారి 21ఎఫ్" సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఆ తరవాత ఇండస్ట్రీలో తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ అయింది. ఇక ఇప్పటివరకు రొమాంటిక్ లవ్ స్టోరీలు మాత్రమే చేసిన హెబ్బా ప్రస్తుతం ఓ డిఫరెంట్ సినిమాలో నటిస్తుంది. "ఓదెల రైల్వే స్టేషన్" పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హెబ్బ ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోన్నట్టు తెలుస్తోంది. తాజాగా హెబ్బా ఫోటోలను సినిమాలో హెబ్బా పేరును చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

 "ఓ పల్లెటూరి అమ్మాయి మృదువువైన హృదయం తో రాధ" అంటూ సినిమాలో హెబ్బా పేరును రాధ గా చిత్ర యూనిట్ పేర్కొంది. ఫొటోలో హెబ్బా పాటిల్ పల్లెటూరి అమ్మాయి గెటప్ లో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సంపత్ నంది స్టోరీని అందించారు. సినిమాలో కన్నడ నటుడు వసిష్ఠ ఎన్ సింహ హీరోగా నటిస్తున్నాడు. అంతే కాకుండా మరో ముఖ్యపాత్రలో పూజిత పొన్నాడ నటిస్తోంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలను అందిస్తున్నారు. 

More Related Stories