English   

రికార్డుల వేటలో ఆర్ఆర్ఆర్ హీరోలు...మొన్న చరణ్ నేడు ఎన్టీఆర్

NTR
2020-11-14 15:47:40

బాహుబలి హిట్ తరవాత దర్శకదీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఇతర ఇండస్ట్రీల నుండి కూడా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగాఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే చరణ్ టీజర్ బీమ్ ఫర్ రామరాజుకు టాలీవుడ్ లో అత్యధిక వ్యూవ్స్ వచ్చి రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ టీజర్ రామ్ ఫర్ భీమరాజు మరో రికార్డును బద్దలు కొట్టింది. 

టాలీవుడ్ లో వన్ మిలియన్ లైక్స్ వచ్చిన టీజర్ గా ఎన్టీఆర్ రికార్డులు బద్దలు కొట్టింది. దాంతో పాటు ఈ టీజర్ కు తక్కువ సమయంలో 30మిలియన్ వ్యూవ్స్ వచ్చి మరో రికార్డును సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ టీజర్ కు లక్షల సంఖ్యలో కామెంట్లు రావడం కూడా విశేషం. ఇక విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టడంతో సినిమా విడుదలైతే కేజిఎఫ్ , బాహుబలి సినిమాల రికార్డులను జక్కన్న క్రాస్ చేస్తారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

More Related Stories