English   

లూసిఫర్ రీమేక్ కోసం హరీష్ శంకర్

Harish Shankar
2020-11-14 16:55:17

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్. ఈ సినిమాను హీరో పృథ్వీరాజ్ నిర్మించి అందులో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు తెగ నచ్చడంతో ఆయన రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. చిరు హీరోగా ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. చిరు కూడా ఈసినిమా తియ్యడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ముందుగా బాబీ,సుజిత్,వివి వినాయక్ లను అప్రోచ్ అయినట్టు వార్తలు వచ్చాయి. 

అంతే కాకుండా సుజిత్ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తరవాత సుజిత్ తప్పకుంటున్నట్టు తెలిసింది . ఇక తరవాత వివి వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వినాయక్ కూడా చాల ఇంటర్వ్యూల్లో లూసిఫర్ ను డైరెక్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. కొంతకాలానికి ఇటీవల వినాయక్ కూడా ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. ఇక తాజాగా లూసిఫర్ రీమేక్ కోసం మెగాస్టార్ హరీష్ శంకర్ కు అప్పగించేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం చిరు పవన్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారట. ఇక హరీష్ శంకర్ అయినా లూసిఫర్ ను డైరెక్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

More Related Stories