English   

కిన్నెరసాని నుండి మెగా అభిమానులకు దీపావళి కానుక

Kinnerasani
2020-11-14 18:41:41

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం అశ్వద్ధామ ఫేమ్ రమణ తేజ డైరెక్షన్ లో సినిమా చేస్తునట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే దీపావళి కనుకాగా ఈరోజు కిన్నెరసాని టైటిల్ లుక్ మరియు థీమ్ చెప్పేలా ఓ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ లో ప్రశాంతమైన సముద్రం ఒడ్డు..యట్ గొలుసులు తాళం వంటి వస్తువులు ఉన్నాయి. అంతే కాకుండా కిన్నెరసాని టైటిల్ కి క్యాప్షన్ గా "అతి సర్వత్ర వర్జయాత్" అని పెట్టారు..అంటే హద్దు లేకపోవడం ప్రమాదకరం అనే అర్థం వస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్, శుభమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఛలో,భీష్మ వంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక కళ్యాణ్ దేవ్ కి కిన్నెరసాని మూడో సినిమా. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కళ్యాణ్ ఎదురుచూస్తున్నాడు.

More Related Stories