English   

కూతుళ్ళతో జీవిత రాజశేఖర్ దీపావళి సంబురాలు

Jeevitha Rajasekhar
2020-11-16 10:46:33

టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఇటీవల కరోన బారిన పడిన సంగతి తెలిసిందే. జీవిత-రాజశేఖర్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందారు. అయితే జీవిత తో పాటు కూతుళ్ళు శివాత్మిక, శివాని లు త్వరగానే కరోన నుండి కొలుకున్నారు. కానీ రాజశేఖర్ ఆరోగ్యం విషమించడంతో ఆయన హైదరాబాద్ లోని న్యూరో ఆసుపత్రిలో చేరారు. మొదట్లో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆ తరవాత ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో వెంటిలేటర్ తొలగించి చికిత్స చేశారు. ఇక ఇటీవలే ఆయన ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయినప్పటికీ రాజశేఖర్ కు కొంత అస్వస్థత ఉన్నట్టు కనిపిస్తోంది. కరోనా నుండి కొలుకున్నా చాలా వీక్ గా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా దీపావళి సంధర్భంగా జీవిత-రాజశేఖర్ తమ కూతుళ్ళు శివాత్మిక, శివాని లతో కలిసి పండగ జరుపుకున్నారు. సెలబ్రేషన్స్ లో రాజశేఖర్ కుటుంబం దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోలో దీపావళి వెలుగులు రాజశేఖర్ ఫ్యామిలిలో కనిపిస్తున్నాయి. రాజశేఖర్ తిరిగి ఆరోగ్యంగా రావడంతో అందరి ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది.

More Related Stories