English   

బ్రేకప్ ను కూడా పబ్లిక్ గా చెప్పుకున్న స్టార్ హీరో సోదరి

Krishna Shroff
2020-11-16 11:13:21

సెలెబ్రెటీలు ప్రేమలో పడటం విడిపోవడం కామన్. కానీ ఆ వ్యవహారం మీడియాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంటారు. కానీ తాజాగా ఓ స్టార్ హీరో సోదరి తన బ్రేకప్ విషయాన్ని పబ్లిక్ లో పెట్టేసింది. ఇక విషయానికొస్తే బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి ...ఒకప్పటి స్టార్ హీరో జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ తన ప్రియుడు ఎబాన్ హైమ్స్ తో బ్రేకప్ అయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కృష్ణ ష్రాఫ్ సినిమాల్లో నటించకపోయినా ఓ పెద్ద సోషల్ మీడియా సెలబ్రెటీ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ కృష్ణ తన పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 

దానిలో భాగంగానే ఈ హాట్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలను కూడా షేర్ చేసేది. అయితే ఇద్దరు విడిపోవడంతో తాజాగా తన సోషల్ మీడియా నుండి ఎబాన్ హైమ్స్ తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసింది. దాంతో నెటిజన్లు ఎబాన్ హైమ్స్ ఫోటోలను ఎందుకు డిలీట్ చేసావంటూ కృష్ణ పోస్ట్స్ కు కామెంట్స్ పెట్టారు. దాంతో ఈ విషయంపై కృష్ణ ష్రాఫ్ తాజాగా స్పందించింది. తనకు తన ప్రియుడు హైమ్స్ కు బ్రేకప్ అయిందని చెప్పేసింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫోటోలను వీడియోలను షేర్ చేయొద్దని తెలిపింది. హైమ్స్ ఫోటోలు పెట్టి తనను టాగ్ చేయొద్దని తేల్చి చెప్పింది.

More Related Stories