English   

బాలీవుడ్ కు ఆకాశమే నీ హద్దురా..హీరో ఎవరంటే

Aakaasam Nee Haddhu Ra
2020-11-16 13:28:45

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరరై  పోట్రు' సినిమా ఈనెల 12 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదలయి జానాల ఆదరణ పొందుతుంది. ఈ సినిమాకు సుధ  దర్శకత్యం వహించారు. ఈ సినిమా తన పదేళ్ల కలగా ఆమె చెప్పారు. అపర్ణ బాలమురలి సూర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను తెలుగులో ఆకాశమే ని హద్దురా అనే టైటిల్ తో విడుదల చేసారు. సినిమాలో సూర్య పాత్రకి తెలుగు యువ కథానాయకుడు సత్య దేవ్ డబ్బింగ్ చెప్పడం విశేషం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయం సాధించిన "ఆకాశమే హద్దురా" విమర్శకుల ప్రశంసలు పొందుతుంది. 

ఈ  సినిమాకు ముందు సూర్య వరుస పారాజయాలతో వెనుకబడిపోయడు. కానీ ఈ సినిమాతో ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక సినిమా కథనుఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు  కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా  తెరకెక్కించడం  జరిగింది. తెలుగు, తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా నచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ షాహిద్ కపూర్ ని సంప్రదించినట్లు... అతను ఒప్పుకున్న వెంటనే ప్రి ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే షాహిద్ కపూర్ "అర్జున్ రెడ్డి"రిమేక్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాకుండా షాహిద్ ప్రస్తుతం తెలుగులో మంచి విజయం సాధించిన నాని "జెర్సీ" సినిమాని కూడా రీమేక్ చేస్తున్నాడు.

More Related Stories