English   

రాపో అరుదైన రికార్డు.. టాలీవుడ్ లో ఒకే ఒక్కడు

Ram Pothineni
2020-11-16 13:56:10

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న  రామ్ పోతినేని వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చూడ్డానికి లవర్ బాయ్ లా కనిపిస్తూ టాలీవుడ్ లో లవ్ రొమాంటిక్ సినిమాలతో పాటు మాస్ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. రామ్ దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే రామ్ సూపర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ ను తనవైపు తిప్పుకున్నాడు. ఆ తరవాత కందిరీగ, నేను శైలజ, రెడీ, హలో గురు ప్రేమకోసమేరా ఈ జీవితం, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా రామ్ తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రామ్ నటించిన గణేష్ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ కు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. 

గణేష్ సినిమాతో కలిపి రామ్ పోతినేని నటించిన ఆరు సినిమాలకు కలిపి 100 మిలియన్ వ్యువ్స్ వచ్చిన ఏకైక టాలీవుడ్ హీరోగా రామ్ రికార్డు నమోదు చేశారు. ఇక రామ్ నటించిన రెడ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను కిషోర్ తిరుమల తెరకెక్కించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తీసిన ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో విడుదల ఆలస్యం అయింది. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమా విడుదల చేయడానికి సంప్రదించినప్పటికి చిత్ర యూనిట్ థియేటర్ లొనే విడుదల చేయాలని భావించినట్టు తెలుస్తోంది. దాంతో సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

More Related Stories