English   

ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమంటున్న ఉప్పెన భామ

 Krithi Shetty
2020-11-16 14:12:14

సినిమా విడుదలకు ముందే క్రేజ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ సినిమా హిట్ అయినా కూడా కొంతమంది హీరోయిన్ లు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ "ఉప్పెన" భామ కృతి శెట్టి మాత్రం మొదటి సినిమా విడుదల కాకముందే ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే "శ్యామ్ సింగరాయ్" సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈ భామ ..సుదీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. "ఉప్పెన" సినిమా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో విడుదల కాకపోయినా.. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు భయట మోగిపోతున్నాయి. "నీ కళ్ళు నీలి సముద్రం" పాట అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా పాటలో క్రితి ఎక్స్ప్రెషన్స్ కు ఎంతో మంది అభిమానులు అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కృతి శెట్టి ఫ్యాన్స్ గ్రూపులు కూడా తెరిచారు. ఇక మంచి స్పీడ్ మీద ఉన్న కృతి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. తనకు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. రామ్ చరణ్ సినిమాలన్నీ చూస్తానని పేర్కొంది. ఇక ఈ భామ తో రాంచరణ్ సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి.

More Related Stories