English   

హీరోయిన్ గా మిహికా..క్లారిటీ ఇచ్చిన రానా

Rana Miheeka Bajaj
2020-11-16 15:05:51

టాలీవుడ్ యంగ్ హీరో రానా లాక్ డౌన్ వేళ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. రానా తన స్నేహితురాలు మిహికా బజాబ్ ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అతికొద్ది మంది అతిథుల మధ్య రానా మిహికాల వివాహ వేడుక జరిగింది. ఇక ఇటీవల కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో రానా-మిహికాలు హనీమూన్ కు వెళ్ళారు. హనీమూన్ లో ఈ జంట దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చూడ్డానికి హీరోయిన్ లా కనిపించే మిహికా బజాబ్ ఈవెంట్ వెడ్డింగ్ ప్లానింగ్ బిసినెస్ చేస్తున్నారు. మిహికా చూడ్డానికి హీరోయిన్ లా ఉండటంతో ఇండస్ట్రీలో కి వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మిహికా హీరోయిన్ గా ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై రానా స్పందించారు. మిహికా కు సినిమాలు చేయడం ఇంట్రెస్ట్ లేదని ఆమె పూర్తిగా తన ఈవెంట్లు, ఇతర బిసినెస్ లపైనే ఫోకస్ పెట్టిందని అన్నారు. ఇదిలా ఉండగా మిహికా తన బిసినెస్ ల పై దృష్టి పెట్టగా...రానా వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రానా విరటపర్వం, అరణ్య సినిమాల్లో నటిస్తున్నాడు.

More Related Stories