English   

కరోనాపై బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..వ్యాక్సిన్ రాదు

Balakrishna
2020-11-16 15:27:13

నందమూరి నటసింహం బాలకృష్ణ సోమవారం  'సెహరి' సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పలు అంశాలపై మాట్లాడారు. కరోనా గురించి కొన్ని సూచనలు చేశారు. కరోనా అనేది నిమోనియాకు సంబందించిన వ్యాది అన్నారు. బాలయ్య మాట్లాడుతూ....చల్లటి నీటితో అస్సలు స్నానం చేయకండి. కొంతమంది పుణ్యం వస్తుందని చెప్తుంటారు. బ్రతికుంటే నే కదా పాపం.. పుణ్యం అని నవ్వుతూ చెప్పారు. కచ్చితంగా వేడి నీటితోనే స్నానం చేయాలని సూచించారు. కరొనకు వ్యాక్సిన్ రాలేదు...రాదు కూడా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. వాక్సీన్ వచ్చినా.. రాకపోయినా మనం దైర్యంగా ఉండాలని చెప్పారు. కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎన్నో ఇబందులు ఏదురుకుందని ఎంతో మంది కష్టాలు పడ్డారని గుర్తు చేసారు. 

ఇటీవలే షూటింగ్లు ప్రారంభం అయ్యాయని ఇలాంటి సమయంలో "సెహరి" సినిమాను ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఇదిలా ఉండగా బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్క్షన్ లో బీబీ 3లో నటిస్తున్నారు. ఈ సినిమాతో హాట్రిక్ కొట్టాలని బోయపాటి చాలా కష్టపడుతున్నారు. బాలయ్య పక్కన నటించేందుకు పలువురు హీరోయిన్ లకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించిన బోయపాటి ఇటీవల అఖిల్ సినిమాతో పరిచయం అయిన సయేశా సెహెగల్ ను ఫైనల్ చేసాడు. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు చేస్తున్నారు. 

More Related Stories