English   

గాలి సంపత్ సినిమాకు అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే

 Anil Ravipudi
2020-11-16 17:11:25

రచయితగా జర్నీ మొదలుపెట్టి టాప్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ టాప్ హీరోస్ తో సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. వెంకటేష్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ , రవితేజ ,సాయి ధరమ్ తేజ్, రామ్ లతో సినిమాలు తీసి అనిల్ ఒక మంచి డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించాడు. ఇక ఇప్పుడు దర్శకత్వంలోనే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా  ఆహా లో ఓ వెబ్ సిరీస్ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్టు ఈ మధ్యే ప్రకటించాడు. కూడా ఇదిలా ఉండగా తాజాగా అనిల్ రవిపూడి తన మిత్రుడు సాయి కృష్ణ నిర్మిస్తున్న సినిమా "గాలి సంపత్ "కు నిర్మాణ సహకారం అందిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ సినిమాకోసం "ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్స్" అనే ఓ బ్యానర్ ను కూడా ప్రారంభించారు. సినిమాలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నారు. సినిమా పేరును "గాలి సంపత్" గా ప్రకటించి మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. సినిమాకు తానే స్క్రీన్ ప్లే ను అందిస్తున్నట్టు పేర్కొన్నారు.  సినిమాకు "అలా ఎలా" సినిమాను తెరకెక్కించిన అనీష్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య జరిగే ఫన్, సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

More Related Stories