English   

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాల్సిందే

Kannada industry
2020-11-17 10:29:34

దేశంలో కరోనా లాక్ డౌన్ తో అన్ని రంగాలు నష్టాలను, కష్టాలను ఎదురుకున్నాయి. అయితే లాక్ డౌన్ తరవాత మెల్లి మెల్లిగా అన్ని రంగాలు తిరిగి పుంజుకుంటున్నాయి. కానీ సినిమా రంగం మాత్రం ఇంకా నష్టాలు, కష్టాల్లోనే ఉంది. కారణం లాక్ డౌన్ తరవాత కూడా సినిమాలపై నిషేధం విధించడమే. పర్మిషన్ లు ఇచ్చినా 60 సంవత్సరాల పై బడిన నటులు షూటింగ్ లకు రావద్దు...10 ఏళ్ళ లోపు పిల్లలు రావద్దు...షూటింగ్ లో ఇంతే మంది ఉండాలి. లాంటి ఎన్నో కండిషన్స్ ప్రభుత్వం పెట్టడం కూడా ఓ కారణమే. పరిశ్రమలో 60 ఏళ్లు పై బడిన హీరోలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు షూటింగ్ లకు రాలేరు. ఆ సినిమా పూర్తవదు. ఇక ఇటీవల అన్ని కండిషన్స్ తీసివేయడంతో షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. అయితే థియేటర్లకు మాత్రం ఇంకా మోక్షం కలగలేదు. 

థియేటర్ లో బొమ్మ వేయాలంటే ప్రేక్షకులు వస్తారో..లేదో అని యజమానులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లకు ప్రజలను రప్పించడానికి కన్నడ పరిశ్రమ కు చెందినవారు ఓ ఎమోషనల్ వీడియోను రూపొందించారు. వీడియోలో కన్నడ స్టార్ హీరోలు పునీత్ రాజ్ కుమార్, మురళి, శివరాజ్ కుమార్ మరికొందరు థియేటర్ గొప్ప తనాన్ని సినిమా గొప్ప తనాన్ని చెబుతూ థియేటర్ లకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇక మన తెలుగు లోను ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అని థియేటర్ ల యజమానుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలు కూడా కన్నడ పరిశ్రమకు చెందిన వారిలా ఓ వీడియోను రూపొందించాల్సిందేమో అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తరవాత కన్నడ ఇండస్ట్రీని చూసి తెలుగు ఇండస్ట్రీ చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది.

More Related Stories