English   

సోనూసూద్ ను ఐకాన్ గా నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్

 Sonu Sood
2020-11-17 10:36:09

రీల్ విలన్ సోనూసూద్ కరోనా లాక్ డౌన్ నుండి రియల్ హీరోగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. లాక్ డౌన్ వేళ సోనూసూద్ ఎంతోమంది వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించడానికి తన డబ్బుతోనే ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా వారికి భోజనాలు పెట్టించి మరీ అన్ని బాగోగులు దగ్గరుండి చూసుకున్నాడు. విదేశాల్లో చిక్కికున్న స్టూడెంట్స్ ను దేశానికి రప్పించడానికి ఓ ప్రైవేట్ విమానాన్ని సైతం ఏర్పాటు చేశాడు. ఇక అప్పటి నుండి కష్టం ఎక్కడుంటే సోనూసూద్ అక్కడ ఉంటున్నాడు. ఏపీలో ఓ పేద రైతు తన కూతుళ్ళ సహాయంతో పొలం దున్నుతున్న వీడియోను సోషల్ మీడియాలో చూసిన సోనూ సాయంత్రానికల్లా ట్రాక్టర్ ను పంపించి వారి పాలిట దేవుడయ్యాడు. ఇక చెప్పుకుంటూ పోతే సోనూసూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. సోనూ చేస్తున్న సహాయాలకు తగినట్టు ఆయనకు గుర్తింపు కూడా లభిస్తోంది. ఎంతోమంది సోనూ ను తమ గుండెల్లో దాచుకున్నారు. మరి కొందరు ఏకంగా గుడులు కడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక తాజాగా సోనూ సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. సోనూ సూద్ ని పంజాబ్ ఎన్నికల కమిషన్ పంజాబ్ ఐకాన్ గా ప్రకటించింది.

More Related Stories