English   

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన

Janasena Party
2020-11-18 07:58:03

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు సిద్ధమౌతున్నాయి. దుబ్బాక విజయం తరవాత బీజేపీ ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఇతర పార్టీలనుండి కూడా అసంతృప్తి తో ఉన్న నాయకులను, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దాంతో ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక దుబ్బాకలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన టిఆర్ఎస్  సైతం గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని డిసైడ్ అయింది. దాంతో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే బిజేపి టార్గెట్ గా విమర్శలు కురిపిస్తున్నారు. 

మరోవైపు ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ కూడా ఈ సారి ఎన్నికల్లో గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఈ సారి పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని జనసేన ప్రకటించింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ లేఖను విడుదల చేసారు. ఇప్పటికే పలు డివిజన్లలో జనసేన పలు కార్యక్రమాల ద్వారా బలం పెంచుకుందని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు పలు సార్లు దీనిపై సమీక్షించుకుని తన వద్దకు వచ్చారని అన్నారు. జనసైనికుల విజ్ఞప్తి మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయినట్టు తెలిపారు. ఇక జనసేన తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలోనూ జనసేన ప్రభావం చూపించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Related Stories