English   

వెబ్ సిరీస్ లో సానియా..దానికోసమే నటిస్తోందట

Sania Mirza
2020-11-18 14:07:26

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా టాలెంట్ తో పాటు అందం ఉన్న క్రీడాకారిణి. దాంతో ఆమె సినిమాల్లోకి రావాలని అప్పట్లో కుర్రకారు అనుకునేవాళ్ళు. హీరోయిన్ యే మాత్రం తీసిపోని సానియా మాత్రం అప్పట్లో వచ్చిన ఆఫర్లకు నో చెప్పేదట. సినిమాల్లో నటించకపోయినా సానియా యాడ్స్ లో తనదైన స్టైల్ లో నటించి అలరించేది. ఇక సానియా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని ఇటు టెన్నిస్ ను అటు వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సానియా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఎంటివి లో వస్తోన్న "నిషేద్ ఏలోన్ టూ టు గెదర్" అనే వెబ్ సిరీస్ లో ఈ భామ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను 5భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.  నవంబర్ చివరవారం నుండి ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ను టీబీ పై అవగాహన కల్పించేందుకు తెరకెక్కిస్తున్నారు. టీబీ ఎప్పటినుండో పీడిస్తున్న సమస్య అని..కరోనా లాంటి సమయంలో దాని ప్రభావం ఎక్కువగా పడుతుందని సానియా అభిప్రాయ పడింది. ఇక ఈ వెబ్ సిరీస్ తో సానియా ఆటతోనే కాకుండా అందంతో కూడా అలరించనుంది.

More Related Stories