English   

మార్చ్ లో హస్తినకు ఎన్టీఆర్

 Jr NTR Trivikram
2020-11-18 14:28:51

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా మార్చ్ నెల నుండి సెట్స్ పైకి వెళుతున్నట్టు సమాచారం. అరవింద సమేత సినిమా తరవాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ సినిమాకు "అయినను పోయిరావలె హస్తినకు" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై యస్. రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కు సంబందించిన సన్నివేశాలు షూట్ చేయడం ఫిబ్రవరి కల్లా పూర్తవుతుందట. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నారు.

More Related Stories