English   

నటి కుష్బూ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం

Kushboos car accident
2020-11-18 14:42:28

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ ప్రయాణిస్తున్న కారుకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తమిళనాడు లోని మెల్మార్ ముత్తూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్యాంకర్ కుష్బూ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కుష్బూకి ఎలాంటి గాయాలు అవ్వలేదు..కానీ కారు పూర్తిగా ధ్వంసం అయినట్టు కనిపిస్తుంది. ఈ విషయాన్ని కుష్బూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలిపారు. యాక్సిడెంట్ అయినప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగితున్నట్టు తెలిపారు. తన భర్త దేవుడిపై ఉంచిన నమ్మకమే ఇప్పుడు తనను కాపాదిందని కుష్బూ పేర్కొన్నారు. కాపాడినందుకు థాంక్యూ మురుగా అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కుష్బూ సౌత్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా కామెడీ పండించడంలోను కుష్బూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటోంది. ఇదివరకు కాంగ్రెస్ లో ఉన్న కుష్బూ ఆమధ్య బీజేపీ గూటికి చేరుకున్నారు.  అందులో భాగంగానే కుష్బూ తమిళనాడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

More Related Stories