English   

చరణ్ ను పెళ్లాడతానంటున్న జబర్దస్త్ బ్యూటీ

Ram Charan
2020-11-19 13:20:40

జబర్ధస్ బ్యూటీ అనసూయ భరధ్వాజ్ ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ హాట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ లకు సమానంగా సంపాదిస్తుందనడంలో సందేహంలేదు. ప్రస్తుతం అనసూయ టివి షోస్ తో పాటు వెబ్ సిరీస్ లలోను నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ హాట్ అందాలు వలకబోస్తూ కుర్రాళ్ళ మతిపోగుడుతూ ఉంటుంది. అనసూయ చాలా సినిమాల్లోనే నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ మాత్రం జనాలకు గుర్తుండిపోతుంది. పల్లెటూరి అత్తలా ఈ సినిమాలో అనసూయ నటన అదుర్స్ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో యాంకర్ లు బుల్లి తెర నటులు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సంపాదించాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఇప్పటికే చాలామంది యాంకర్ లు నటీనటులు చానల్స్ ఓపెన్ చేసారు. 

ఇక యాంకర్ శ్రీముఖి కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఛానల్ లో శ్రీముఖి "ఉమేనియా " అనే ఓ ప్రోగ్రాం చేస్తుంది. ఈ ప్రోగ్రాం లో ఇప్పటికే చాలామంది లేడీ యాంకర్ లను ఇంటర్వ్యూ చేసింది. ఇక తాజాగా హాట్ బ్యూటీ అనసూయను కూడా శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. అయితే ఇంటర్వ్యూ లో భాగంగా "కిల్ మ్యారి హుక్" అంటూ అనసూయను ప్రశ్నించింది. దాంతో అనసూయ కిల్ సాయిధరమ్ తేజ్,మ్యారి రాంచరణ్ , హుక్ అప్ నాగార్జున అంటూ సమాధానం ఇచ్చింది. ఇద్దరు పిల్లలున్న అనసూయ..ఆల్రెడీ పెళ్ళైన చరణ్ ను పెళ్లాడతా అనడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

More Related Stories