English   

సమంత షోలో మెగాస్టార్ సందడి

Chiranjeevi
2020-11-19 14:21:33

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి తరవాత కూడా కెరీర్ లో దూసుకుపోతుంది. నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా వుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లు, టాక్ షోలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవలే అల్లు వారి ఓటీటీ యాప్ ఆహాలోను "సామ్ జామ్" పేరుతో ఓ టాక్ షోను చేస్తుంది. సమంత టాక్ షో చేస్తుండటం తో ఈ షోకు ఇప్పటికే చాలా క్రేజ్ వచ్చింది. ఇక ఆ క్రేజ్ ను మరింత పెంచేలా టాప్ హీరోలతో సామ్ ఇంటర్వ్యూలు చేస్తోంది. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో సామ్ ఇంటర్వ్యూ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. 

సామ్ జామ్ షోకి చిరు వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక మెగాస్టార్ ను సమంత ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ను ఇటీవల తిరిగి ప్రారంభించారు. కాగా చిరు షూటింగ్ కోసం కరోనా టెస్ట్ చేసుకోవడం తో పాజిటివ్ వచ్చింది. అయితే అది తప్పుడు రిపోర్ట్ అని తేలడంతో చిరు షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తరువాత మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ సినిమాలో నటించనున్నారు. అయితే లూసిఫర్ రీమేక్ కి చాలా మంది డైరెక్టర్ లను అంకున్నప్పటికీ ఇంకా డైరెక్టర్ ఎవరన్నది డిసైడ్ అవ్వలేదు.

More Related Stories