English   

ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్..ఫొటోస్ వైరల్

Jr NTR
2020-11-19 18:16:41

కరోనా ఎఫెక్ట్ తో 7 నెలలుగా ఇంటికే పరిమితమైన మన తెలుగు హీరోలంతా ఇప్పుడిపుడే బయటికి వస్తున్నారు. దాదాపుగా యంగ్ హీరోలు అందరూ షూటింగ్ లో పాల్గొంటున్నప్పటికి కొంతమంది సీనియర్ హీరోలు మాత్రం ఇంకా షూటింగ్స్ మొదలుపెట్టలేదు. ఇక కరోనా వ్యాప్తి తగ్గక మాత్రం మన తెలుగు నటి నటులు ఒకరి తరువాత ఒకరు తమ కుటుంబాలతో సరదాగా గడపడానికి విదేశాలకు వెకేషన్ కి వెళుతున్నారు. దానిలో భాగంగా కాజల్, గౌతమ్ దంపతులు వివాహం తరువాత మాళ్దివులకు హనీమూన్ కి వెళ్లారు.  హీరోయిన్ ప్రణీత కుడా ప్రస్తుతం మాలదీవుల్లోనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనా తరువాత సినిమా షూటింగ్స్ లో ఇంకా  పాల్గొనలేదు.

 ఇక సినిమా షూటింగ్స్ పాల్గొనడానికి ముందే తన కుటుంబంతో కలిసి దుబాయ్ వేకేషన్ కి వెళ్లి వచ్చారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కుటుంబం తో దుబాయ్ టూర్ ని పూర్తిచేసుకుని బుధవారం అర్థరాత్రి హైదరబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఈ ఫొటోస్ లో ఎన్టీఆర్ ఎరుపు టీ షర్ట్, బ్లూ జీన్స్ లో మాస్క్ ధరించి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రసుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు 'అయినను హస్తినకు పోయిరావలె" అనే టైటిల్ ను  పరిశీలిస్తున్నారు.

More Related Stories