English   

ఉప్పెన భామకి డిమాండ్ మామూలుగా లేదు..

Krithi Shetty
2020-11-20 11:58:52

కరోనా లాక్ డౌన్ కారణంగా  విడుదల కాకుండా నిలిచిపోయిన సినిమాల్లో ఉప్పెన సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో మెగా ఫామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ తెలుగు ప్రేక్షకులను  పలకరించబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాకు ఒక ప్రొడ్యూసర్ గా వ్యహరిస్తున్నాడు. బుచ్చి బాబు ఉప్పెనకు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. సినిమా ఇంకా విడుదలకు నోచుకోకపోయినా కృతి శెట్టి మాత్రం తెలుగు టాప్ హీరోయిన్స్ కి గుబులు పుట్టిస్తుంది. కేవలం ఒక పాటలో తన ఇచ్చిన ఎస్ప్రెషన్స్ కి చాలా మంది ఫిలిమ్ మేకర్స్ కన్ను కృతి శెట్టి పై పడింది. ఇప్పటికే నాని సరసన "శ్యామ్ సింగరాయి" లో ఒక కథా నాయకిగా ఎన్నికయింది. 

అంతే కాకుండా కృతికి తెలుగులో చాలా అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయని తెలుస్తుంది. ప్రొడ్యూసర్స్ ఇప్పటికే ఒక్కో సినిమాకు 60 లక్షలు ఇవ్వడానికైనా వెనకాడట్లేదని తెలుస్తుంది. ఇంత మొత్తం అంటే ఒక స్టార్ హీరోయిన్లకు ఇచ్చే దాంట్లో దాదాపు సగం వరకు అని చెప్పచ్చు. ఇంత రెమ్యూనిరేషన్ తీసుకోవడానికి చాలా మంది హీరోయిన్స్ కి కనీసం 3 మంచి సినిమాలైనా చేయాల్సిందే. కానీ కృతి శెట్టి మాత్రం ఇలాంటి అవకాశాన్ని ఫస్ట్ సినిమా కూడా విడుదల కాకుండానే సంపాదించింది. మరి కృతి శెట్టి ఈ సినిమాలతో అలాంటి స్థానాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఇక "ఉప్పెన" సినిమాను ఎన్నో ప్రముఖ ott సంస్థలు సంప్రధించినా థియేటర్ లోనే విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యింది.

More Related Stories