English   

మాజీ ప్రియుడికి షాకిచ్చిన అమలా పాల్

Amala Paul
2020-11-21 11:02:30

గత కొంతకాలంగా నటి అమలా పాల్ తరచూ వార్తల్లో నిలుస్తూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతుంది. అప్పట్లో దర్శకుడు విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న ఈ భామ కొన్నిరోజులకే అతడికి విడాకులిచ్చి వార్తల్లో నిలిచింది. తాజాగా తన మాజీ ప్రియుడికి అమలా పాల్ షాక్ ఇచ్చింది. విజయ్ కి విడాకులిచ్చిన తరవాత అమలాపాల్ ముంబై కి చెందిన బవనిందర్ సింగ్ అనే ఓ గాయకుడితో ప్రేమాయణం నడిపించింది. ఇద్దరూ క్లోజ్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. అంతే కాకుండా భవిందర్ సింగ్ తో ఈ అమ్మడి ఎంగేజ్మెంట్ కుడా జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. 

తరవాత ఇద్దరూ పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోలు .ముద్దులు పెట్టుకున్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో గుట్టు చప్పుడు కాకుండా అమలాపాల్ వివాహం అంటూ మరోసారి వార్తల్లో కెక్కింది. తరవాత కొద్దిరోజులకి ఇద్దరిమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ విడిపోయారు. అయితే విడిపోయాక కూడా భవిందర్ సింగ్ ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అమలా పాల్ ఆగ్రహం వ్యక్తం చెస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అమలా పాల్ కి అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. సోషల్ మీడియా నుండి ఫోటోలను తొలగించాలని అమలాపాల్ ప్రియుడిని ఆదేశించింది.

More Related Stories