English   

సర్కారువారిపాటకు క్లాప్ కొట్టిన సితార

Sarkaru Vaari Paata
2020-11-21 15:11:14

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట' మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ గా తెరకెక్కనుంది. నవంబర్ 21న 4th KPHB  కాలనీ లోని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో 11:43 కి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఘట్టమనేని సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమెరా స్విచ్ ఆన్  చేశారు. ముహూర్తం షాట్ ని  కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో తీశారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు ఇతర తారాగణం నటిస్తోంది. సినిమా కు ఎస్ ఎస్ తమన్ స్వరాలను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్  పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. మహేష్ బాబు మెడపై ఉన్న రూపాయి బిళ్ళ టాటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవలే ఫ్యామిలీతో టూర్ కి వెళ్లివచ్చిన మహేష్ బాబు మళ్ళీ షూటింగ్ లో అఫుగుపెట్టడంతో సినిమా త్వరగానే పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది.

More Related Stories