English   

అంటే సుందారనికి అనే టైటిల్ తో నాని

Nani
2020-11-21 23:54:52

టాలీవుడ్ హీరో నాని 28వ సినిమా అప్డేట్ వచ్చేసింది. నాని తన 28వ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాకు "అంటే సుందరానికి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా పోస్టర్ లుక్ లో నాని గోచి కట్టుకుని కామెడీ లుక్ లో కనిపిస్తున్నాడు. సినిమా టైటిల్ కూడా డిఫరెంట్ గా ఉండటంతో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తమిళ నటి నజ్రియా నటిస్తోంది. రాజా రాణి సినిమాతో తెలుగులో అభిమానులను సొంతం చేసుకున్న నజ్రియా ఈ సినిమాతో తెలుగులో నేరుగా మూవీ చేస్తుంది. దాంతో ఆమె అభిమానులు సంబురపడుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో నర్జియానే తెలుగు డబ్బింగ్ కూడా చెబుతోందట. ఈ సినిమాకు దర్శకుడు వివేక్ ఆత్రేయ రచయిత గా కూడా వ్యవహరించడం విశేషం. వివేక్ ఆత్రేయ తీసిన "మెంటల్ మదిలో, బ్రోచేవారేవారురా" రెండు సినిమాలతోనే ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాకు నవీన్ ఎరనేని, రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని "టక్ జగదీష్" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత "శ్యామ్ సింగరాయ్" సినిమా చిత్రీకరణ మొదలవుతున్నది. అనంతరం "అంటే సుందారనికి.." సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

More Related Stories