English   

ఆపకుండా మాట్లాడే నేను సైలెంట్ గా ఉన్నా..

Anchor Suma
2020-11-21 17:02:42

తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ యాంకర్ సుమ కనకాల అన్నారు. తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి కేటీఆర్ మరియు ఆయన బృందం చేస్తున్న కృషి అద్భుతమని పేర్కొన్నారు. ఈ మేరకు సుమ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. "కేటీఆర్ తో సంబంధించడం ఆనందంగా ఉంది. ఒక హైదరాబాధీగా మన నగరం అభివృద్ధి మరియు తదుపరి చర్యల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మీకు మీ కుటుంబానికి కుదూస్ సార్..షో లలో నేను గడగడా మాట్లాడతాను..కానీ మీ నాయకత్వం నన్ను శ్రద్ధగా వినేలా చేసింది. ప్రకటించడం...అంకిత భావంతో పని చేయడం. అమలు చేయడం మీ మార్గాలు సూపర్ సార్" 

అంటూ సుమ ట్వీట్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం పై మరియు కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా ట్వీట్ లో సుమ..కేటీఆర్ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు చూస్తుంటే  కేటీఆర్ ను సుమ ఇంటర్వ్యూ చేసినట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా సుమ కనకాల ఓ వైపు టివీ షోలు మరోవైపు సినిమా రిలీజ్ ఈవెంట్లు చేస్తూ బిజీగా వుంది. ఇక ఇటీవలే తన కుమారుడిని  హీరోగా పరిచయం చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. సుమ కనకాల, రాజీవ్ కనకాల ఇద్దరూ కలిసి తమ కుమారుడి సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

More Related Stories