English   

వర్మ శశికళ బయోపిక్ విడుదల చేసేది అప్పుడేనట

Sasikala
2020-11-21 17:54:25

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ "శశికళ" అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళనాడు దివంగత ముజ్యమంత్రి జయలలిత  ప్రాణ స్నేహితురాలు శశికళ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు వర్మ పేర్కొన్నారు. సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా వర్మ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పోస్టర్ లో శశికళ మరియు ఆమె స్నేహితురాలు జయలలిత ఉన్నారు. అంతే కాకుండా పోస్టర్ లో "లవ్ ఈస్ డేంజరెస్లి పొలిటికల్" అనే టాగ్ లైన్ ఉంది. ఇక తాజాగా ఈ సినిమా కు సంబందించిన ఓ అప్డేట్ ను వర్మ పాటించారు. ఈ సినిమాను తమిళనాడు ఎన్నికలకు ముందు విడుదల చేస్తున్నట్టు వర్మ ప్రకటించారు.

 "ఈ సినిమా ఒక మహిళ s ఒక పురుషుడు e ని నాయకుడిని చేసిన దాని గురించి. ..లీడర్ బయోపిక్ కాబట్టి తమిళనాడు ఎన్నికల ముందు విడుదల అవుతుంది" అంటూ వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. వర్మ తన ట్వీట్ లో పేర్కొన్న "s" లెటర్ శశికళ అని అర్థంవుతుండగా.. పురుషుడు "e" ఎవరన్నదనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమా తమిళనాడు ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా వర్మ తమిళనాడు ఎన్నికలకు ముందు సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అన్ని సినిమాల్లాగే కోర్టు చిక్కుల్లో పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా తమిళ రాజకీయాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

More Related Stories