English   

ఆచార్య సెట్స్ లో సోనూసూద్ కు ఘన సన్మానం

Actor Sonu Sood
2020-11-21 18:25:04

రీల్ విలన్ నుండి రియల్ హీరో గా పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ వలస కార్మికులకు అండగా ఉన్నాడు. లాక్ డౌన్ తో రవాణా మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో సొంత డబ్బుతో బస్సులు ఏర్పాటు చేసి వలస కార్మికులను ఇంటికి చేర్చాడు. దగ్గరుండి మరీ వారికి భోజనాలు పెట్టించి అన్ని ఏర్పాట్లు చూసుకున్నాడు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఇంటికి చేర్చాడు. ఇక లాక్ డౌన్ తరవాత కూడా సోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. 

ఏపీలో ఓ రైతు కూతుళ్ళ సహాయంతో పొలం దున్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సాయంత్రానికల్లా వాళ్ళ ఇంటికి ట్రాక్టర్ ను పంపించి ఆదుకున్నారు. సాఫ్ట్వేర్ శారద అంటూ ఓ కథనం రావడంతో ఆమెకు ఉద్యోగం ఇప్పించి అన్నగా మారాడు. ఇలాంటి సేవాకార్యక్రమలు చేస్తుండటంతో సోనూపై ప్రశంసలు కురిశాయి. అంతే కాకుండా ఎంతోమంది సోనూ సూద్ పేరు, ఫోటో పెట్టుకుని వ్యాపారాలు మొదలుపెట్టారు. మరి కొంతమంది సోనూకు పూజలు చేయడం..గుడి కంటించడం లాంటివి కూడా చేసారు. ఇక తాజాగా చిరంజీవి హీరోగా వస్తోన్న " ఆచార్య" సినిమాలో సోనూకు ఘనంగా సన్మానం చేశారు. తనికెళ్ళ భరణి సోనూసూద్ కు శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు కొరటాల శివను కూడా తనికెళ్ళ భరణి సత్కరించారు.

More Related Stories