English   

కరోనా భయం..షూటింగ్ నుండి వెళ్లిపోయిన శ్రుతిహాసన్

Shruti
2020-11-23 17:56:58

దక్షిణాది భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటూ బాలీవుడ్ లోనూ బిజీ అయిపోయింది. టాలీవుడ్ లో తన అందం, నటనతో ఎన్నో ఆఫర్లు దక్కించుకుంది. తెలుగులో పవన్ కల్యం, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ భామ ఐరన్ లెగ్ గా పెరు తెచ్చుకుంది. కానీ పవన్ కల్యాన్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఐరన్ లెగ్ కాదని గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది. ఆ తరవాత మళ్ళీ శృతి ఆఫర్ల కోసం తిరిగి చూళ్ళేదు. వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో బిజీ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో రవితేజ, పవన్ కళ్యాణ్ లతో నటిస్తోంది. 

అలాగే తమిళ్ లో "లాభం" అనే సినిమాలో నటిస్తోంది. సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ధర్మగిరి, కృష్ణ గిరి ప్రాంతాల్లో జరుగుతుంది. అయితే సినిమా షూటింగ్ ను చూడ్డానికి ఆ పరిసర ప్రాంతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తరలి రావడంతో శృతిహాసన్ షూటింగ్ మధ్యలోనే నుండే ప్యాకేజీ చెప్పి వెళ్ళిపోయింది. కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న కారణంగానే శృతి షూటింగ్ నుండి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.

More Related Stories