English   

తెలంగాణలో రేపే థియేటర్ల ఓపెనింగ్

Telangana theatres
2020-11-23 18:03:45

కరోనా విజృంభన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ తరవాత అన్నీ తెరుచుకున్నప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. దాంతో థియేటర్ల యాజమాన్యాలు తీవ్ర నష్టాల్లో కూరుకపోయాయి. మరోవైపు థియేటర్లు తెరవలన్నా సినిమాలు విడుదల కు సిద్ధంగా లేని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా థియేటర్ లు తెరిచినా జనాలు వస్తారా లేదా అన్న ప్రశ్న కూడా ధియేటర్ ల యజమానులకు మొదలయ్యింది. 

ఇక ఎనిమిది నెలల తరువాత థియేటర్ల ఓపెనింగ్ కు తెలంగాణ రాష్ట్రంలో అనుమతి లభించింది. థియేటర్లకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 శాతం సీటింగ్ తో థియేటర్ ల ఓపెనింగ్ కు అనుమతినిచ్చింది. థియేటర్లో ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా థియేటర్ లో సానిటైజ్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. థియేటర్ లోపల ఏసీ టెంపరేచర్ కూడా 24 నుండి 30 డిగ్రీలవరకు ఉంచాలని పేర్కొంది. ఇక సర్కార్ అనుమతిచ్చినప్పటికి ప్రజలు థియేటర్లకు వస్తారా లేదా అన్న ప్రశ్న మొదలైంది. ఓటిటికి అలవాటు పడ్డ జనాలు మళ్ళీ థియేటర్ల వైపు మల్లుతారా లేదా అన్నది చూడాలి.

More Related Stories