English   

మహా సర్కార్ తో తిప్పలు..హైదరాబాద్ కు మకాం మార్చిన బ్యూటీ

 Kangana Ranaut
2020-11-24 12:43:10

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరవాత ఈ భామ బాలీవుడ్ లో కలకలం సృటించింది. సుశాంత్ మరణానికి ఇండస్ట్రీ లోని పెద్దలే కారణమని..నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడని కామెంట్లు చేసింది. దాంతో నెటిజన్లు సైతం కంగనా కు సపోర్ట్ చేస్తూ బాలీవుడ్ పెద్దలపై మండిపడ్డారు. అంతే కాకుండా ఈ భామ ఏకంగా సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేస్తూ మరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ ఇష్యు తరవాత ఏకంగా మగరాష్ట్ర సర్కార్ తోనే పెట్టుకుంది. 

కంగనా మహా సర్కార్ పై చేసిన విమర్శల నేపథ్యంలో శివసేన సర్కార్ ముంబై లో ఉన్మ కంగనా రనౌత్ ఆఫీసును ధ్వంసం చేసింది. దాంతో కంగనా రోడ్డెక్కి రచ్చ చేసింది. మహా సర్కార్ తో తనకు ముప్పు ఉందంని..ఏకంగా మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి తనకు వై క్యాటగిరి భద్రత కల్పించాలని కోరింది. దాంతో ముంబై లో అడుగుపెట్టిన కంగనా కు కేంద్ర బలగాలు రక్షణ కల్పించాయి. ఇక శివసేన సర్కార్ తో గొడవలు ఉన్న నేపథ్యంలో కంగనా తన షూటింగులన్ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసుకుంటుంది. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా హైదరాబాద్ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేసింది. ఇక ప్రస్తుతం కంగన..జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న "తలైవి" అనే సినిమా షూటింగ్ లో బిజీగా వుంది.

More Related Stories