English   

కాసేపట్లో తన భార్యను పరిచయం చేయనున్న ప్రభుదేవా

Prabhu Deva
2020-11-24 14:28:21

రాజు సుందరం కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికి ప్రభుదేవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొరియోగ్రాఫర్ గా పేరు ప్రతిష్టలు సంపాదించిన ప్రభుదేవా ఆ తరవాత నటుడిగా..దర్శకుడిగా మారి మెప్పించాడు. ఇక సినిమా విషయం పక్కన పెడితే ప్రభుదేవ పర్సనల్ లైఫ్ మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొదట రామలత ను వివాహం చేసుకున్న ప్రభుదేవా ఆతరవత ఆమెకు విడాకులిచ్చాడు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఆ తరవాత లేడీ సూపర్ స్టార్ నయనతార తో ప్రేమాయణం నడిపించి వార్తల్లోకెక్కాడు. నయనతారతో ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్లింది. కానీ సడెన్ గా ఈ ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

 ఇక అనంతరం తన మేనకోడలిని వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అది కూడా జరగలేదు. ఇక చాలా రోజుల క్రితం రవితేజ తనకు చికిత్స చేసిన ఓ ఫిజియో థెరపిస్ట్ ను సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడట. ఈ విషయం ఈ మద్యే భయటకు వచ్చింది. ప్రభుదేవాకు వెన్నుముక కి చికిత్స చేసిన హిమాని అనే ఫిజియో థెరపిస్ట్ తో ఏడాది పాటు డేటింగ్ చేసి ఆ తరవాత ప్రభుదేవా వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుదేవ తండ్రి రాజు సుందరం కూడా మీడియా ముందు వెల్లడించారు. ఇక తాజాగా ప్రభుదేవా తన భార్యను ప్రపంచానికి పరిచయం చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే మరి కొద్దిసేపట్లో తన భార్య ను పరిచయం చేయడానికి ఆయన ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

More Related Stories