English   

బుట్టబొమ్మను వదలని వార్నర్..ఈసారి ఇలా

 Butta Bomma
2020-11-24 14:50:48

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శశ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన "అల వైకుంఠ పురంలో" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా విడుదలకు ముందే సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. విడుదలకు ముందే ఎక్కడ చూసినా అల వైకుంఠ పురం పాటలు మోగిపోయాయి. ఈ సినిమాకు ఎస్.ఎస్ థమన్ స్వరాలను అందించారు. 

థమన్ ఇచ్చిన మ్యూజిక్ తో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.  మరోవైపు ఈ సినిమాలోని పాటల్లో "బుట్ట బొమ్మ" సాంగ్ కి మరింత క్రేజ్ వచ్చింది. ఈ పాట కొన్నిరోజుల పాటు టిక్ టాక్ లో హల్చల్ చేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం తన భార్య క్యాండీస్ తో కలిసి ఈ పాటకు స్టెప్పులేశారు. దాంతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా ఇటీవల ఐపిఎల్ సందర్భంగా కూడా వార్నర్ బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసి అలరించారు. ఇక తాజాగా వార్నర్ మరోసారి బుట్టబొమ్మ పాట పై స్పందించారు. యూట్యూబ్ లో ఈ పాటకి 450 మిలియన్ వ్యువ్స్ వచ్చిన సందర్భంగా వార్నర్ హీరో అల్లుఅర్జున్ ను ప్రశంసిస్తూ "వెల్ డన్ అల్లు అర్జున్" అంటూ బుట్ట బొమ్మ పాటకి సంబందించిన పోస్టర్ ను అప్లోడ్ చేశారు.

More Related Stories