English   

సినిమాలేమీ లేకపోయినా ట్రెండింగ్ లో అనుష్క

 Anushka Shetty
2020-11-26 13:12:06

టాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం యే సినిమా చేయకపోయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మడిపేరే వినిపిస్తోంది. అసలు అనుష్క పేరు ఎందుకు ఇంతలా వినిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. అనుష్క అప్పట్లో భాగమతి అనేపేరుతో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. కాగా భాగమతి సినిమా హిందీ రీమేక్ లో బాలీవుడ్ భామ భూమి ఫడ్నేకర్ నటించింది. ఈ సినిమా రీమేక్ ను హిందీలో దుర్గామతి గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను చూసినవారు భూమి నటన చూసి నిరాశచెందారు.

భూమి మంచి నటి అయినా ఈ సినిమాలో అనుష్క అంత పర్ఫామెన్స్ చేయలేకపోయిందని అంటున్నారు. దాంతో ట్రైలర్ చూడగానే అభిమానులు నిరాశ చెందుతున్నారు. దాంతో అనుష్క బాగా నటించిందని జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అనుష్క గురించి ఆమె నటన గురించి ట్విట్టర్ లో తెగ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా అనుష్క స్క్రీన్ ప్రెజంటేషన్ కు భూమి పోటీ ఇవ్వలేకపోయిందని అనుకుంటున్నారు. దేశంలో అనుష్క రేంజ్ వేరు...అని ఆమె అరుదైన నటి అని ఆమె  అభిమానులు పొగదల వర్షం కురిపిస్తున్నారు.   

More Related Stories