ఈసారి రొమాంటిక్ ఎంటర్టైనర్తో వస్తోన్న జార్జిరెడ్డి

'వంగవీటి', 'జార్జి రెడ్డి' లాంటి బయోపిక్ సినిమాలతో లతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు సందీప్ మాధవ్ ఈసారి ఒక సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్తో మన ముందుకు రానున్నారు. జార్జి రెడ్డి సినిమాతో సందీప్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు హిట్ టాక్ రాకపోయినప్పటికీ సినిమాలో సందీప్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా ఇప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ముందుకు వస్తున్నారు. హల్సియన్ మూవీ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా సినిమాటోగ్రాఫర్ అరుణ్ కుమార్ సూరపనేని నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నది. ఈ మూవీతో జె.వి. మధుకిరణ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆయన గతంలో డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) రూపొందించిన చిత్రాలతో పాటు పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. అలానే ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ రోల్లో ప్రముఖనటుడు నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర నిర్మాత తెలియచేశారు.