English   

అవును నాపేరు నిక్కత్ ఖాన్...అయితే ఏంటి

Kushboo
2020-11-27 16:22:24

దక్షిణాది నటి కుష్బూ సుందర్ అప్పట్లో తెలుగు ,తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక వయస్సు మీద పడ్డాక తల్లి, సోదరి పాత్రల్లో నటిస్తూ ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే కుష్బూ మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటోంది. స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉండే కుష్బూ మొన్నటివరకు కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే కాంగ్రెస్ నుండి బీజేపీ గూటికి చేరింది.

 కాగా తాజాగా కుష్బూ ఓ నెటిజన్ కామెంట్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. బీజేపీలో చేరిన నువ్వు వాళ్లకు విధేయురాలిగా ఉండటం నేర్చుకో నిక్కత్ ఖాన్ అంటూ నెటిజన్ కామెంట్ పెట్టగా...కుష్బూ అతడికి సమాధానమిస్తూ.."అవును నా పేరు నిక్కత్ ఖాన్. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళకే నా పేరుతో ప్రాబ్లమ్ అనుకునేదాన్ని. కానీ ఇలా ఎప్పుడూ ఊహించలేదు. నా పేరు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. నా పేరుతో నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా..లేదంటే ముస్లిమ్స్ విధేయతతో ఉంటారని ప్రాబ్లమా..?" అంటూ సమాధానం ఇచ్చింది.

More Related Stories