దర్శకేంద్రుడి సినిమాలో శ్రీయ రమ్యకృష్ణ

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనదైన రాజముద్ర వేసుకున్నారు. కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా..నిర్మాతగా, రచయితగా, కొరియోగ్రాఫర్ గా రాఘవేంద్ర రావు పరిశ్రమలో రాణించారు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ సినిమాలకు దర్శకత్వం చేశారు. పెళ్లి సందడి లాంటి ప్రేమ కథా చిత్రాలనే కాకుండా అన్నమ్మయ్య, శిరిడి సాయి, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలను తెరకెక్కించారు.
ఇక మొదటిసారి తనజీవితంలో రాఘవేంద్ర రావు నటుడిగా మారనున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన ముగురు కథానాయికలు నటించనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమాలో శ్రీయ, రమ్యకృష్ణ నటించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి దర్శకత్వం వహిస్తుండగా..జనార్ధన్ మహర్షి కథను సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక డైరెక్షన్ లో సత్తాచాటిన రాఘవేంద్ర రావు..నటుడిగా ఏ మేరకు అలరిస్తారో చూడాలి.