English   

ప్రకాష్ రాజ్ పై నాగబాబు ఫైర్

Naga Babu
2020-11-28 11:43:08

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఊసరవెల్లి అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాజ్యాలపై నాగబాబు ఫైర్ అయ్యారు. ఈ మేరకు నాగబాబు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసారు. రాజకీయాల్లో కొన్ని సార్లు నిర్ణయాలు మారుతుంటాయని దాని ఉద్దేశం ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలగజేసేందుకే అని వ్యాఖ్యానించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కి సపోర్ట్ చేయడం వల్ల జనసేనకు ప్రయోజనాలు ఉన్నట్టు తెలిపారు. కేంద్రంలో బీజేపీ..రాష్ట్రంలో జనసేన మాత్రమే అభివృద్ధి చేయగలదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎవరికి ద్రోహం చేసాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నారు. ప్రకాష్ రాజ్ నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రమణ్య స్వామి డిబేట్ లొనే అర్థమయ్యింది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడటానికి తడపడ్డావు. అది నాకు ఇంకా గుర్తుంది. 

నీకు బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పు లేదు. అలాగే బీజేపీ గాని ఇతర పార్టీలు గాని మంచి చేస్తే ప్రశంసించాలి. నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని చేసిన బీజేపీ.. జనసేన కూటమి శక్తిని ఆపలేరు. అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. నువ్వు ప్రొడ్యూసర్ లను ఎంత ఇబ్బంది పెట్టావో..డేట్స్ ఇచ్చి క్యాన్సల్ చేసి ఎంత  హింసించావో అన్ని గుర్తున్నాయ్. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. అప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఓ మంచి మనిషి..నిస్వార్థ రాజకీయనాయకుడిని విమర్శించు. డైరెక్టర్ లను కాకా పట్టి నిర్మాతలను కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడటం ఏం తెలుసు అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బిజెపి దోస్తీ కచ్చితంగా సత్తా చాటబోతుందని వ్యాఖ్యానించారు.

More Related Stories