English   

ఆది పురుష్ కి హీరోయిన్ గా మహేష్ భామ

Kriti Sanon
2020-11-28 15:37:02

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ఆదిపురుష్". ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా..ప్రభాస్ కు ప్రతి నాయకుడుగా కీలకమైన లంకేశ్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.  ఈ సినిమాను త్రీడీ గా చిత్రిస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను మలయాళ, తమిళ, కన్నడ భాషలతో పాటు అందర్జాతీయ భాషల్లో డబ్ చేయనున్నారు.  

ఇక ఈ సినిమాను 2021 లో సెట్స్ పైకి తీసుకువచ్చి 2022 లో విడుదల చేస్తామని ప్రకటించారు. గుల్షన్ కుమార్, టిసిరీస్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఓం రౌత్, భూషణ్ కుమార్, ప్రసాద్ సూతర్ ,రాజేష్ నాయర్ లు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కృతి సనన్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను పలు సినిమాల్లో నటించింది. మహేష్ బాబు నెం1 సినిమాలో ఈ అమ్మడు నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

More Related Stories