English   

నిహారిక పెళ్లి..మెగా డాటర్స్ సందడి

 Niharika
2020-11-28 15:50:47

మెగా డాటర్ నిహారిక గుంటూరు ఐజీ కుమారుడు చైతన్య దంతులూరిని పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం డిసెంబర్ లో రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ ప్యాలెస్ లో జరగనుంది. కాగా ఈ పెళ్లికి సంబంధించి నాగబాబు ఆయన సతీమణి బంధువులను చూసుకుంటూ ఉండగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దగ్గరుండి చెల్లెలి పెళ్లి పనులకు ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే తాజగా నిహారిక ప్రీవెడ్డింగ్ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. 

ఈ పెళ్లికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల ముందే వస్తారని. మెగా హీరోలంతా ఈ పెళ్లిలో సందడి చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజగా నిహారిక తన సిస్టర్స్ తో కలిసి డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిన్నర్ పార్టీలో మెగాస్టార్ కూతుళ్ళు శ్రీజ-సుస్మిత ఉన్నారు. చెల్లి పెళ్లి  పేరుతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితమే నిహారిక తన వుడ్ బీ తో కలిసి గోవాలో బ్యాచిలర్ పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

More Related Stories