English   

రజినీకాంత్ కు షాక్ ఇచ్చిన అభిమాన సంఘాలు

Rajinikanth
2020-11-30 12:20:51

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత మూడేళ్ళుగా పార్టీ పెడతానంటూ చెబుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు రజిని తన అభిమాన సంఘం మక్కల్ మండ్రమ్ తో సమావేశమయ్యారు. కానీ పార్టీ పేరును గాని తన పొలిటికల్ ఎంట్రీపై గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈరోజు ఉదయం రజినీకాంత్ తన 30జిల్లాల అభిమాన సంఘాలతో చెన్నై లో ఓ కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి కేవలం 50 మందికే ఆహ్వానం పంపినప్పటికీ రజినీకాంత్ అభిమానులు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరయ్యారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో తన పొలిటికల్ ఎంట్రీపై రజినీ పూర్తి క్లారిటీ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

గతంలో ఎన్నికల సమయంలో రజినీకాంత్ ఇలానే సమావేశం ఏర్పాటు చేసి ఓ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. కాగా ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తమిళనాడు వచ్చి రజీని ని కలిశారు. దాంతో రజినీ ఈ సారి బీజేపీ కి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ఈసారి మాత్రం రజినీ పొలిటికల్ పార్టీ కచ్చితంగా పెట్టాలని ఫ్యాన్స్  డిమాండ్ చేస్తున్నారు. సమావేశంలో బీజీపీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. రజినీ పార్టీ పెడితేనే ఆయన వెంట నడుస్తామని అభిమాన సంఘాలు తెచ్చి చెప్పాయి. ఒకవేళ పార్టీ పెట్టనట్లయితే రజినీ వెంట నడవమని స్పష్టం చేసాయి. దాంతో రజిని తన అభిమాన సంఘాలను బుజ్జగించే పనిలో ఉన్నారు. 

More Related Stories