English   

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా

Prabhas
2020-11-30 20:17:16

బాహుబలి బ్రేక్ చేసిన రికార్డులతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇదివరకు టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ ల హీరోలకి పోటీగా మారాడు. దాంతో అన్ని ఇండస్ట్రీ లలో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో ప్రస్తుతం ప్యాన్ ఇండియా రేంజ్ లొనే సినిమాలకు ఒకే చెబుతున్నాడు. ఇటీవలే ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న రాధేశ్యాం సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లొనే తెరకెక్కించారు. ఈ సినిమాను జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేశారు. సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. 

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న తరవాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ కి రెడీ అయ్యాడు. ఆదిపురుష్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను బాలివుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ డిసెంబర్ 2న రానుంది. ఇక కేజీఎఫ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..బహుబలి లాంటి రికార్డులు బ్రేక్ చేసిన సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Related Stories